బోధన్, బతుకమ్మ: బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర గోశాల నుంచి దుండుగులు గోవులను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. సోమవారం అర్ధరాత్రి దుండుగులు వీధి దీపాలను బంద్ చేసి గోవులకు మత్తు మందు ఇస్తుండగా, స్థానికులు అప్రమత్తమై అడ్డుకున్నారు. దీంతో దుండుగులు పరారయ్యారు. గోశాల నిర్వాహకులు పశువైద్యులను రప్పించి ఆవులకు చికిత్స చేయిస్తున్నారు.