Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 7:18 pm Posted by : ramakrishna

గో హత్యను నిషేదించాలి

 

. . . గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి

 

రుద్రూర్, బతుకమ్మ :

 

గో ఆరాధన ఉద్యమం కార్యక్రమంలో భాగంగా గో సంరక్ష సేవకులు, హిందూ సంఘాల నాయకులు సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ తారాబాయికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని, గో హత్యను నిషేధించాలని, గో సంతతి కాపాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, వెంకటేశం, బొజగొండ అనీల్, పత్తి రాము, గణేష్, కటికే రామ్ రాజ్, పార్వతి మురళి, ఎముల గజేందర్, మహిపాల్, వీరేశం సెట్, కేవి మోహన్, బజరంగ్దళ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.