మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి ఒక రోజు సామాజిక సేవ చేయాలని కోర్టు తీర్పు

నిజామాబాద్, బతుకమ్మ : మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తిలో మార్పు రావాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సాధారణంగా మోతాద్ కు మించి మద్యం సేవించిన వారికి  జరిమానా విధించడం, అంతకన్నాఎక్కువగా జైలు శిక్ష విధించడం సర్వసాధారణమైంది. కానీ నిజామాబాద్ లో తొలిసారి న్యాయస్థానం మద్యం సేవించి బైక్  నడిపిన వ్యక్తికి ఒక రోజు సామాజిక సేవా చేయాలని తీర్పును  వెలువరించింది. నిజామాబాద్ నగరంలోని  ఆరవ టౌన్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా శామీర్ పేట్ మండలం పొన్నాల గ్రామానికి బత్తిని నవీన్...