Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 September 2024, 6:51 pm Posted by : ramakrishna

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి ఒక రోజు సామాజిక సేవ చేయాలని కోర్టు తీర్పు

నిజామాబాద్, బతుకమ్మ : మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తిలో మార్పు రావాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సాధారణంగా మోతాద్ కు మించి మద్యం సేవించిన వారికి  జరిమానా విధించడం, అంతకన్నాఎక్కువగా జైలు శిక్ష విధించడం సర్వసాధారణమైంది. కానీ నిజామాబాద్ లో తొలిసారి న్యాయస్థానం మద్యం సేవించి బైక్  నడిపిన వ్యక్తికి ఒక రోజు సామాజిక సేవా చేయాలని తీర్పును  వెలువరించింది. నిజామాబాద్ నగరంలోని  ఆరవ టౌన్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా శామీర్ పేట్ మండలం పొన్నాల గ్రామానికి బత్తిని నవీన్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు దొరికాడు. అతనిపై కేసు నమోదు చేసి నిజామాబాద్ స్పెషల్ జ్యుడిషియన్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అజ్మీరా సాకేత్  కుమార్ (ట్రైనీ  కలెక్టర్) ముందు హాజరుపరిచారు. ఆయన నూతన క్రిమినల్ చట్టాలను పరిగణలోకి తీసుకుని నవీన్ కుమార్ కు ఒక రోజు సామాజిక సేవా  చేయాలని తీర్పు చెప్పారు. డిచ్ పల్లి మందడలంలోని మానవతా సదన్ లో ఒక రోజు సామాజిక సేవా చేయాలని తీర్పునిచ్చారు.