కోర్టు పేషీలకు గైర్హాజరు… ఇద్దరి కి రిమాండ్ విధించిన కోర్టు

 ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ధరావత్ రమేష్,  మక్కల గంగాధర్ గత కొన్ని రోజులుగా కోర్టు పేషీలకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ వారిపై నాన్‌బెయిలబుల్ వారంట్లు జారీ చేశారు. కోర్టు పెషిలకు హాజరు కాని రమేష్ , గంగాధర్ లను సోమవారం ఎల్లారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం మేజిస్ట్రేట్ ఇద్దరు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎల్లారెడ్డి ఎస్ ఐ బి. మహేష్  తెలిపారు. కోర్టు వాయిదాలకు హాజరు కాని వ్యక్తులు...