Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 8:32 pm Posted by : ramakrishna

 వీడీసీ లకు న్యాయస్థానం షాక్

 

. . .కులం పేరిట దూషించిన అవమానించి ఐదుగురికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

. . . రెండు నేరాలలో దూస్ గామ్ గ్రామ మాజీ సర్పంచ్ తో పాటు వీడీసీ సభ్యుల కు జైలు

. . .  జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి సుగాలి నారాయణ  సంచలన తీర్పు

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ

నిజామాబాద్ జిల్లాలో అరాచక పాలన చేస్తు, చట్టాన్ని ఖాతరు చేయని గ్రామ అభివృద్ధి కమిటీ ల కు షాక్ ఇస్తు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జీ జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పారు.

డప్పులు కొట్టడం జీవనోపాధిగా ఉన్న కులస్తులు వారు, అడపాదడపా అప్పుడప్పుడు కూలీ పని చేసుకుని కడుపు నింపుకునే దళితులు వారు.నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆర్మూర్, నిజామాబాద్ రెవిన్యూ డివిజన్ లో గ్రామ అభివృద్ధి కమిటీ లదే రాజ్యం. గ్రామంలో అన్ని వారే వారి మాటకు, తీర్మానాలకు తిరుగే ఉండదు. ఆఖరికి రాష్ట్ర హైకోర్టు  విడిసీలవి చట్టవిరుద్ద చర్యలు వద్దని చెప్పిన, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్ పర్సన్ జీవిఎన్ భారత లక్ష్మీ గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసి విడిసి లు చట్ట ప్రకారం నడుచుకోవాలి హితబోధ చేసిన పెడచెవిన పెట్టి మేము చెప్పింది చట్టం మా విడిసి ల తీర్మానాలు శాసనాలు అన్న తీరుగా వారి వ్యవహార శైలి ఉన్నది. నిజమైన చట్టం జూలు విదిలిస్తే అందరు కలిసి జైలుపాలు కావడం. కోర్టు తీర్పు మిగతా విడిసీ లకు కనువిప్పు కానుంది…

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దూస్ గామ్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మంద లక్ష్మణ్ ,మంద మోహన్ ,మంద రాజయ్య,శివాయోళ్ల శివారెడ్డి,శివాయోళ్ల గంగారెడ్డి లకు రెండు నేరాలలో ఐదు సంవత్సరాల చొప్పున కఠిన కారాగార శిక్షలు పదివేలు చొప్పున జరిమానా విధిస్తూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పై జరిగిన అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ సెషన్స్ జడ్జి సుగాలి నారాయణ బుధవారం తీర్పు చెప్పారని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ తెలిపారు. పి పి తెలిపిన వివరాలు. నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎ. వెంకటేశ్వర్ 2021సెప్టెంబర్ 24 న కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ అదారంగా … డిచ్ పల్లి మండలం దూస్ గామ్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాదిగ కులానికి చెందిన గర్క సురేష్ మరో ఇరవై రెండు మంది కులస్థులు విడిసి వారిని అన్ని ప్రధాన పదవులు మీరే అనుభవిస్తున్నారు మాకు కూడా ఒక సంవత్సరం అట్టి పదవులు అప్పగించాలని డిమాండ్ చేశారు. వీడీసీ సమావేశంలో 2021 ఆగస్టు 21 న విడిసి భవనం దగ్గరికి సురేష్ ఇతరలు కలిసి వెళ్లి లక్ష్మణ్, మోహన్, రాజయ్య, సర్పంచ్ శివాయోళ్ల శివారెడ్డి, శివాయోళ్ల గంగారెడ్డి లను కలిసి విడిసి విషయమై మరొకమారు మాట్లాడారు. “మీరు చేసేది ఏందిరా మాదిగ కుక్కల్లారా… మీకు అవసరమా అడుక్కు తినేటోళ్లు.. మేము పెడితే తినేటోళ్ళు మమ్మల్ని అడుగుతారారా.. మీకు క్యాషియర్ పదవి ఇస్తే మేము వచ్చి మీ మాటలు వినాల.. మీకు ఇస్తే విడిసి పెద్ద మనిషి తనంకు రాము “. ప్రజల ముందు బహిరంగ ప్రదేశంలో దూషించి, కులం పేరిట అవమానించారు.  ఈ విషయంలో యాభై మాదిగ కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారు. 25 ఆగస్టు, 2021 న ఒక శుభ కార్యక్రమం కోసం శివారు గ్రామం కులాస్ పూర్ నుండి దళితులలోనే మరొక వర్గం వారిని తెచ్చి దూస్ గాంలో డబ్బులు కొట్టించడానికి ప్రయత్నాలు చేశారు.మాకే మరో ఐదు వందల పెంచమంటే పెంచకుండా పోటీగా పక్క గ్రామం వాళ్లను తీసుకొచ్చి మా మధ్య విబేధాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేశారు. సదరు నేర అభియోగాలు రుజువు కావడంతో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పై అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్ 3 (1) బహిరంగ ప్రదేశంలో అవమానించడం ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా, సెక్షన్ 3(1) ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ జడ్జి సుగాలి నారాయణ తీర్పు వెలువరించారు. కేసు న్యాయ విచారణ లో ఉండగా రెండవ ముద్దాయి మంద జనార్ధన్ గల్ఫ్ దేశానికి వెళ్లగా ఆయన పైన కేసు వేరు చేశారు.ఏడవ ముద్దాయి ఇందూరు రాములు మృతి చెందాదాడు.