Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 March 2025, 1:39 pm Posted by : ramakrishna

కరీంనగర్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య

కరీంనగర్,బతుకమ్మ : కరీంనగర్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..  జిల్లాలోని చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన అరుణ్ కుమార్ (24), అదే మండలం భూపాలపట్నంకు చెందిన అలేఖ్య (21) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.  ఈక్రమంలో అలేఖ్యకు వేరే వ్యక్తితో వివాహం కోసం సంబంధాలు చూస్తున్నారు. తమ వివాహం జరగదని భావించిన ప్రేమికులు కరీంనగర్ లో మిత్రుడి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.  కాగా, ఈఘటనతో రెండు గ్రామాల్లో  విషాదం చోటుచేసుకుంది.