నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్టు

పెట్టుబడి దారు తెలంగాణ వ్యక్తి.. తయారు చేసేది ఉత్తరాది రాష్ట్రాల వ్యక్తులు పట్టుబడిన వారిలో కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కామారెడ్డి, బతుకమ్మ: నకిలీ నోట్ల తయారీ ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.56లక్షల నకిలీ కరెన్సీ, నోట్ల తయారీకి ఉపయోగించిన సామగ్రిని సీజ్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ శనివారం వెల్లడించారు. ఈనెల 13వ తేదీన బాన్సువాడ పోలీసులు కొయ్యగుట్ట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా...