Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 September 2024, 2:34 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబానికి పరామర్శ

బతుకమ్మ, నిజామాబాద్ : నాలాల కొట్టుకుపోయి చనిపోయిన బాలిక అనన్య కుటుంబాన్ని రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ బుధవారం పరామర్శించారు. నగరంలోని ఆనంద్ నగర్ లో ఉన్న బాధిత కుటుంబాన్ని వారి ఇంటికి వెళ్లి ఓదార్చి ఆర్థికసాయం అందజేశారు. ప్రభుత్వం తరఫున రూ.4లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రమాదకరమైన నాలాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట నాయకులు కేశ వేణు, నరాల రత్నాకర్, శోభన్ తదితరులు ఉన్నారు.