Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 6:11 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబానికి పరామర్శ

బాన్సువాడ, బతుకమ్మ  : నసుర్లబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో గత మూడు రోజుల క్రితం ప్రమాదవశత్తు కాలుజారి చెరువులో పడిన మరణించిన కిసరి రాములు కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ పరామర్శించి ఓదార్చారు. ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ధైర్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు నర్సింలు గౌడ్, ఎండి ఆఫ్రోజ్, జి.శంకర్ టేకుర్ల సాయిలు, కురుమ గంగారం, అంజయ్య, జిలకర సాయిలు, బాలయ్య, గైనీ భూమేష్, కుంది రాములు తదితరులు పాల్గొన్నారు.