బాధిత కుటుంబాలకు పరామర్శ

ఎల్లారెడ్డి, బతుకమ్మ : రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన తాత సిద్ది రాములు (50)  మనవడు శ్రేయాంక్ (04) వెళ్తున్న వాహనాన్ని బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ బస్వన్నపల్లి గ్రామంలో గల సిద్ది రాములు, శ్రేయాంక్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చి, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాల బాధాకరం అని అన్నారు. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వం తరపున...