నేడు డీఎస్సీ 2024 లో ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్
నిజామాబాద్ , బతుకమ్మ: డిఎస్సీ 2024 ఉపాధ్యాయ నియమాకంలో అర్హత సాధించి అపాయింట్ మెంట్ లు పొందిన అభ్యర్ధులకు మంగళవారం కౌన్సిలింగ్ కు హజరు కావాలని జిల్లా విద్యాశాఖాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కొత్త కలెక్టరేట్ ప్రాంగణంలోని రూమ్ నంబర్ 103 నందుకు ఎస్ జిటి సత్ససమాన క్యాడర్ లోని అన్ని మీడియంలలోని ఉపాధ్యాయులకు, పండిత్ లకు, పిఇటిలకు కౌన్సిలింగ్ ఉంటుందని తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ ఉపాధ్యాయులకు రూమ్ నంబర్ 117 లో కౌన్సిలింగ్ ఉంటుందని పెర్కోన్నారు. ఉదయం 9...