Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2025, 8:42 pm Posted by : ramakrishna

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

నిజామాబాద్, బతుకమ్మ : పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం టూ టౌన్, నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని రౌడీషీటర్లను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు. కౌన్సిలింగ్లో ఎవరైనా చట్ట వ్యతిరేకమైన సంఘటనలకు పాల్పడితే ల్యాండ్ సెటిల్మెంట్లకు గాని, డబ్బుల సెటిల్మెంట్లో పాల్పడినట్లైతే చట్ట పరంగా కఠినమైన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో ఉంటే వారి పైన ఉన్న షీట్లు క్లోజ్ చేయడం జరుగుతుందన్నారు. అసాంఘిక చర్యలకు పాల్పడినట్లయితే రౌడీ షీట్లు కొనసాగించడంతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు పిడి ఆక్ట్ నమోదు చేయబడుతుందని  హెచ్చరించారు. ఈ కార్యక్రంలో ఎస్ఐలు ముజాహిద్, శ్రీకాంత్, ఉదయ్ పాల్గొన్నారు.

Counseling for rowdy sheeters