- సామాజిక తనిఖీలో బట్టబయలు
తాడ్వాయి, బతుకమ్మ : తాడ్వాయి మండలంలోని సోమవారం గ్రామపంచాయితీ పరిధిలో సోమవారం 16వ సామాజిక తనిఖీ కార్యక్రమం బిఆర్పి కే.మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో ఒకే కుటుంబానికి బహుళ జాబుకార్డులను గుర్తించారు. ఒకరి పేరు మీద ఒకరు పని చేస్తూ డబ్బులు తీసుకుంటూ ఫోర్జరీ సంతకాలతో పేమెంట్ చేసిన వైనం బట్టబయలైంది. పనిచేయకుండానే 6 మంది పేర్ల మీద రూ.34,180, మాస్టర్లో పనిచేసిన వారి సంతకాలు కాకుండా సీనియర్ మేట్ తో సంతకాలు చేపించి రూ.4,80,000 పేమెంట్ చేసినట్లు గుర్తించారు. మాస్టర్లు లో పంచాయతీ కార్యదర్శి సంతకాలు లేకుండానే, పని చేసిన ఉపాధి హామీ కూలీల సంతకాలు లేకుండానే, రోజువారి హాజరు లేకుండానే పనిచేసిన వారికి కాకుండా చేయని వారికి కూడా పేమెంట్ తీసుకున్నారని గుర్తించారు. అంతేకాకుండా ఒకే కుటుంబంలో పెళ్లి కానీ వారికి కూడా జాబ్ కార్డు ఇప్పించి పేమెంట్ డ్రా చేశారని సామాజిక తనిఖీ గ్రామ సభలో గుర్తించారు.
