Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 June 2025, 2:38 pm Posted by : ramakrishna

రాజన్న లడ్డూప్రసాదంలో అవినీతి వివాదం

చర్యలకు సిద్ధమైన దేవాదాయశాఖ

వేములవాడ, బతుకమ్మ: వేములవాడ రాజన్న ఆలయంలో లడ్డూప్రసాదంలో అవినీతి వివాదం రాజుకుంది. ఆలయ కార్యనిర్వాహక అధికారితోపాటు ఏడుగురిపై చర్యలకు దేవాదాయశాఖ సిద్ధమైంది. గతేడాది వేములవాడ రాజన్న ఆలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ప్రసాదాల తయారీ, విక్రయాలు, గోడౌన్లలో అవినీతి జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. మరోవైపు రాజన్న ఆలయంలో వరుసగా కొడేలు మృతి చెందడంపై  భక్తులను ఆందోళన చెందుతున్నారు.