కామారెడ్డి మున్సిపల్‌లో అవినీతి ఆరోపణలు
. . . విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ కౌన్సిలర్ల వెల్లడి కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మున్సిపల్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ పాలకవర్గంపై పలు ఆరోపణలు చేశారు. కామారెడ్డి మున్సిపల్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి పదవుల పంపకాలపై అవగాహనకు వచ్చాయని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ పంపకాలలో భాగంగానే ఒక పార్టీకి...