Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 12:39 pm Posted by : ramakrishna

అవినీతి అనకొండ రేవంత్ రెడ్డి

హైదరాబాద్, బతుకమ్మ  : రేవంత్ రెడ్డి అవినీతి అనకొండ అని, డిల్లీకి మూటలు పంపేందుకు , దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం పారిశ్రామిక భూములను చౌకధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుందని విమర్శించారు. పారిశ్రామిక భూములు బదలాయింపు అంశంపై బీఆర్ ఎస్ నిజ నిర్ధారణ  బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నాయి. ఈక్రమంలో జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కేటీఆర్ గురువారం పర్యటించి హమాలీలతో మాట్లాడారు.  రూ. 5లక్ష ల కోట్ల భూ కుంభకోణంపై క్షేత్ర స్థాయిలో పోరాడుతామన్నారు. ఆషాఢం సెల్ వంటి ఆఫర్ ను చూసి పారిశ్రామికవేత్తలు మోసపోవద్దని, రేవంత్ భూ కుంభ కోణంలో మీరు భాగం కావొద్దని సూచించారు. ఎవరి ప్రయోజనాల కోసం భూములను ధారదత్తం చేస్తున్నారని ప్రశ్నించారు. మా ప్రభుత్వం వచ్చాక ఆభూములను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు.