నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా దిలీప్ కుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. మేడ్చల్ జెడ్పీ సీఈవోగా పని చేసిన ఆయన బదిలీపై వచ్చారు. కమిషనర్ చాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన దిలీప్ కుమార్ కు డిప్యూటీ కమిషనర్ తో పాటు ఉద్యోగులు, సిబ్బంది స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

