Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2024, 8:49 pm Posted by : ramakrishna

ఉమ్మడి జిల్లాలో జాతీయ జండాను ఎగురవేసేదే కార్పొరేషన్ చైర్మన్లు

. . . నిజామాబాద్ లో ఈరవత్రి అనిల్, కామారెడ్డిలో పటేల్ రమేష్ రెడ్డి
. . . క్యాబినెట్ లో స్థానం లేకపోవడమే కారణం
బతుకమ్మ, నిజామాబాద్
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తొలిసారి జాతీయ జండా ఎగురవేసే అవకాశం కార్పొరేషన్ల చైర్మన్లకు దక్కింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు రాష్ట్ర క్యాబినెట్ లో అవకాశం దక్కకపోవడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రులు జాతీయ జండా ఎగురవేయడం ఆనవాయితీగా వస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే ఆనవాయితీ కొనసాగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రెండు జిల్లాలో ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వ క్యాబినెట్ లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు అవకాశం లేకపోవడంతో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ర్ే ప్రభుత్వం తరపున ప్రిన్సిపల్ సెక్రటరి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషేన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిలు జాతీయ జండాను ఎగురవేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా వారు అతిథులుగా హాజరుకానున్నారు.