Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 7:30 pm Posted by : ramakrishna

కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల సేకరణ

 

. . . గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్మోహన్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కళాశాలలో విద్యా ప్రమాణాలు పెంచడానికి సీఎస్ఆర్ నిధులను సేకరిస్తున్నట్టు గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఉన్నత అధికారుల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ఉత్తర్వుల మేరకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల సేకరణ ద్వారా కళాశాలలో విద్యా ప్రమాణాలు పెంచుట, కొరత గల సౌకర్యాలను మెరుగుపరచుట వంటి అవసరాల కొరకు నిర్దిష్ట లాభాలున్న కంపెనీలు తమ నికర లాభంలో రెండు శాతం కేటాయించాలన్నారు. ఈ నిబంధనలలో భాగంగా జి.జి. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి, ఏ.ఓ. రామ్ కిషన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగ రత్నం, వినయ కుమార్, దండు స్వామి, తదితర అధ్యాపకులు వివిధ కార్పొరేట్ సంస్థలను నిధుల కోసం కలుస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ప్రగతినగర్ బ్రాంచ్ మేనేజర్ ను కలిసామని, మేనేజర్ సహకరిస్తామని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.