ర్యాంకుల కోసం ప్రాణాలతో కార్పొరేట్ కాలేజీల చెలగాటం
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ర్యాంకుల కోసం ప్రాణాలతో కార్పొరేట్ కాలేజీల చెలగాటం ఆడుతున్నాయని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ అన్నారు. కార్పొరేట్ కాలేజీల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థుల మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలని డిమాండ్ చేస్తూ పీ.డీ.ఎస్.యు. ఆధ్వర్యంలో శనివారం కోటగల్లి లోని ఎన్.ఆర్. భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. హైదరాబాద్ శ్రీచైతన్య విద్యార్థి...