న్యూఢిల్లీ, బతుకమ్మ: దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. మే 26వ తేదీ వరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 1010 కేసులు నమోదుకాగా, నాలుగు రోజుల్లోనే ఆ సంఖ్య 2,710కు పెరిగింది. ఈ లెక్కలను స్వయాన కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖనే ప్రకటించింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ లలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో ఫ్రజలు ఆందోళన చెందుతున్నారు. కొత్త వేరియంట్ వైరస్ కు భయపడొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
రాష్ట్రాల వారీగా కేసులు..
దేశ వ్యాప్తంగా 2,710 కరోనా కేసులు నమోదు కాగా, కేరళలో 1,147, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్ లో 223, తమిళనాడులో 148, కర్ణాటకలో 148, పశ్చిమ బెంగాల్ లో 116, రాజస్థాన్ లో 51, ఉత్తర ప్రదేశ్ లో 42, పుదుచ్చేరిలో 25, హరియాణాలో 20, ఆంద్రప్రదేశ్ లో 16, మధ్య ప్రదేశ్ లో 10, గోవాలో 7, ఒడిశా, పంజాబ్, జమ్మూకశ్మీర్ లో నాలుగు చొప్పున, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాల్లో ఒక్కో కరోనా కేసు నమోదైంది.