Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2024, 5:09 pm Posted by : ramakrishna

కాపర్ వైర్ దొంగల అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఎలక్ట్రికల్ కాపర్ చోరీ కేసులో మంగళవారం ముగ్గురిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు.  పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లాలోని లక్ష్మాపూర్, సమ్నాపూర్ రైల్వేష్టేషన్ మధ్యలో కొత్తగా రైల్వే ఎలక్ట్రిక్ పనలు జరుగుతున్నయి. అయితే నవంబర్ 19న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు 320 మీటర్ల ఎలక్ట్రిక్ కాపర్ వైరును కట్ చేసి తీసుకు వెళ్లారు. దీనిపై ఇందుస్ ప్రాజెక్టు ప్రవేట్ లిమిటెడ్ కు చెందిన సూపర్ వైజర్ ప్రవీణ్ నవంబర్ 22న నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిమిత్తం మెదక్ జిల్లాకు వెళ్లి అనుమాతులను పట్టకొని విచారించగా నేరాన్ని ఒప్పకున్నారు.  మెదక్ జిల్లాలోని హవేలీ ఘన్పూర్ కు చెందిన ముదావత్ ఆమీన్, ముదావత్ సుభాస్, మెదక్ కు చెందిన టేకు సత్యం ను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి చోరీ చేసిన కాపర్ వైర్ ను రికవరీ చేశారు. చోరీకి గురైన కాపర్ వైర్ విలువ రూ.1.28లక్షలు ఉంటుంది. అరెస్టు చేసిన ముగ్గరిని కోర్టులో హాజరు పరిచారు. ఈ కార్యక్రమంలో ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ రావు, ఎస్ఐ తావు నాయక్, కానిస్టేబుల్ గురుదాస్ సలావుద్దీన్ పాల్గొన్నారు.