బడి పిల్లలకు రాగి జావా

మోర్తాడ్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని గురువారం నుంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాగి జావా ఇస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిరణ్ కుమార్ అన్నారు. ఒకరోజు కోడిగుడ్డు మరుసటి రోజు రాగి జావా ఇలా వారానికి మూడుసార్లు రాగి జావా, మూడుసార్లు కోడిగుడ్డు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.