Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 6:56 pm Posted by : ramakrishna

వైద్యాధికారులకు, పీహెచ్ సీ సిబ్బందికి మధ్య సమన్వయం చాలా అవసరం

 

. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా.బి రాజశ్రీ

 

. . . ఫార్మసీ అధికారులకు ఆన్ లైన్ రిపోర్టింగ్ పై శిక్షణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

వైద్యాధికారులకు పీహెచ్ సీ సిబ్బందికి మధ్య సమన్వయం చాలా అవసరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా.బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని ఫార్మసీ అధికారులకు డ్రగ్ అండ్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టం పై సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీడీఎం నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీడీఎం మాట్లాడుతూ ఇంతవరకు ఈ ఔషధీ ద్వారా ఆన్ లైన్ లో డ్రగ్స్ రిసీవ్డ్, డిస్ట్రి బూషన్, బ్యాలెన్స్, ఎకనాలెడ్జ్మెంట్ జరిగేవని, ఫ్యామిలీ ప్లానింగ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా తాత్కాలిక పద్ధతులైన ఓరల్ పిల్స్, నిరోధ్, ఐయుడి, పీపీఐయుసిడి, అంతరా ఇంజక్షన్ లాంటివి సపరేటుగా ఆన్ లైన్ లో రిపోర్టింగ్ జరిగేవని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ రెండింటిని డ్రగ్స్ అండ్ వ్యాక్సినేషన్ డెసిషన్ మేనేజ్మెంట్ సిస్టం(డివిడిఎంఎస్) తో కలిపి చేయడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం డిఎంహెచ్ఓ మాట్లాడుతూ వైద్యులందరూ సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలన్నారు. అందుబాటులో ఉన్న మెడిసిన్స్ లిస్ట్ అవుట్ చేసి ప్రదర్శించాలని, స్టాక్ రిజిస్టర్స్, డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్స్, ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. ఎక్స్ పైర్డ్ మందులను వెంటనే తొలగించాలని, ఈ విన్ లో డ్యూ లిస్టు ప్రకారంగా ఎంట్రీ చేయాలని తెలిపారు. అత్యవసర కిట్టులను అందుబాటులో ఉంచాలని, ఐ ఎల్ ఆర్, డి ఫ్రీజర్ లో టెంపరేచర్ మెయింటైన్ చేయాలన్నారు. రికార్డ్స్, రిపోర్ట్స్ మెయింటైన్ చేయాలని, రోజు రోజుకు పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు వడ దెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, ఆశా కార్యకర్తలు అందరూ ప్రతి గృహాన్ని సందర్శించి, రోగులను గుర్తించి ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ ను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసిహెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్వేత, డిస్ట్రిక్ట్ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ శ్రావ్య, ఫార్మసీ సూపర్ వైజర్ నారాయణ, డిడిఎంలు నారాయణ, పృథ్వి, డిహెచ్ఈ ఘన్ పూర్ వెంకటేశ్వర్లు, హెచ్ ఈ ఓ శ్రీనివాస్, వివిధ పీహెచ్ సీల నుండి విచ్చేసిన ఫార్మసిస్టులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.

 

Coordination between medical officers and PHC staff is very necessary.