Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 September 2025, 6:18 pm Posted by : ramakrishna

సహకార సంఘం మహాజన సభ వాయిదా

  • సిబ్బంది తీరుపై సభ్యుల ఆగ్రహం

 

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి సహకారం సంఘం ఆధ్వర్యంలో సంఘం చైర్మన్ కూచి సిద్దులు అధ్యక్షతన మహాజన సభను నిర్వహించగా సంఘం కార్యదర్శి విఠల్ నివేదికను చదవి వినిపించారు. సంఘం కోటి ముప్పై లక్షల రూపాయలతో  జమలను కలిగి ఉందని అన్నారు. సమావేశంలో  సిబ్బంది రైతుల పట్ల వ్యవరిస్తున్న తీరు పై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విదంగా బోగస్ బోనస్ పై విచారణ  ఎంత వరకు వచ్చిందని కార్యదర్శి ప్రశ్నించారు.  బోగస్ బోనస్ పై విచారణ రిపోర్ట్ తీసుకున్న తరువాతే మహాజన సభ ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. రిపోర్ట్ వచ్చిన తరువాతే మహాజన సభ నిర్వహిస్తామని తీర్మానం చేసి సభ వాయిదా వేశారు. ఈ సమావేశంలో సంఘం డైరెక్టర్లు శ్రీధర్, శ్రీనివాస్, సాయిరెడ్డి, వీరేషం, సంఘం సభ్యులు కొట్టం మనోహర్, పత్తి లక్ష్మణ్,తెల్ల రవి, ఏముల నవీన్, బీర్కూర్ గంగాధర్, పుల్లల మోహన్ రావు,బర్ల మధుకర్, కప్ప గణేష్, గాండ్ల శ్రీను, పి. సతీష్, మామిడి శ్రీనివాస్,షాయిద్ హౌగిర్రావ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.