బోధన్, బతుకమ్మ: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో కోరారు. ఈనెల 9 నుంచి ప్రారంభమైన సర్వే ఇప్పటి వరకు 30శాతం పూర్తయ్యిందని తెలిపారు. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ ల్లో ఏ రోజు ఎక్కడ సర్వే నిర్వహిస్తున్న సమాచారాన్ని స్థానికులకు తెలుపాలన్నారు. సర్వేలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని, బోధన్ డివిజన్ లో సర్వే తీరును ప్రతిరోజూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారన్నారు.