మెండోరా, బతుకమ్మ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలదృశ్యాలను ప్రాజెక్టు అందాలను చూడడానికి వస్తున్న సందర్శకులు రావద్దంటూ కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. బాల్కొండ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుంచి వరద అధికంగా రావడంతో వచ్చేవారికి ఇబ్బంది కలుగుతుందని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోచంపాడు చౌరస్తా లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి సంబంధిత అధికారులను స్థానికులను మాత్రమే లోపలి లోపలికి అనుమతిస్తున్నట్లు తెలియజేశారు. కావున స్థానిక నిజమాబాద్ జిల్లా చుట్టుపక్కల నిర్మల్, మంచిర్యాల్, కామారెడ్డి, అదిలాబాద్ తదితర జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులు కొంతకాలం రావద్దు అంటూ కార్యక్రమంలో మెండోరా ఎస్సై సుహాసిని, మండల అధికారులు సంతోష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.