ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మార్చి నెలలోనే ఎండలు తీవ్రత అధికమైన దృష్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాలు, మండల కేంద్రాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కేంద్రాలతో పాటు, పట్టణాలు మండల కేంద్రాలలో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు పాఠశాలలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులు, చిన్నారులకు త్రాగునీరు లేక హోటళ్ళను, త్రాగునీటిని విక్రయించే షాపులను ఆశ్రయించి త్రాగునీటిని కొనుగోలు చేస్తున్నారు. చాలామంది మధ్యతరగతి ప్రజలు వాటర్...