బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మార్చి నెలలోనే ఎండలు తీవ్రత అధికమైన దృష్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాలు, మండల కేంద్రాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కేంద్రాలతో పాటు, పట్టణాలు మండల కేంద్రాలలో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు పాఠశాలలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులు, చిన్నారులకు త్రాగునీరు లేక హోటళ్ళను, త్రాగునీటిని విక్రయించే షాపులను ఆశ్రయించి త్రాగునీటిని కొనుగోలు చేస్తున్నారు. చాలామంది మధ్యతరగతి ప్రజలు వాటర్ బాటిళ్ళను కొనుగోలు చేయలేక హోటళ్ళలో ఇచ్చే కలుషితమైన నీటిని త్రాగి అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఎండలు ముదిరి త్రాగునీటి కోసం అల్లాడుతున్న ప్రజలకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే వ్యాపారులు, రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
