అంగన్ వాడీ సెంటర్లకు కుక్కర్లు అందజేత
రుద్రూర్, బతుకమ్మ : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని అంగన్ వాడీ కేంద్రంలో మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తపల్లి రవి కిరణ్ 8 అంగన్ వాడీ కేంద్రాలకు కుక్కర్లను అందజేశారు. అనంతరం కొత్తపల్లి రవికిరణ్ ను అంగన్ వాడీ టీచర్లు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ సూపర్వైజర్ శ్రీలత, అంగన్ వాడీ...