Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2025, 5:10 pm Posted by : ramakrishna

జీవనశైలి మార్పులతోనే అధిక రక్తపోటు నియంత్రణ

  • ఇన్చార్జి డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ తుకారం రాథోడ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జీవనశైలి మార్పులతోనే అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుందని ఇన్చార్జి డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ తుకారం రాథోడ్ అన్నారు. ప్రపంచ అధిక రక్తపోటు నియంత్రణ దినోత్సవంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోనీ అర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ర్యాలీ నిర్వహించి అవగాహన    కార్యక్రమాన్ని జిల్లా శిక్షణ కేంద్రం పిఓడిటిటిలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో వైద్య సిబ్బందికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవన శైలి వ్యాధులకు ముఖ్యంగా అధిక రక్తపోటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉప్పు వాడకాన్ని తగ్గించాలని ఆహారాన్ని పరిమిత స్థాయిలో తీసుకోవాలని, నిల్వ ఆహార పదార్థాలను, బేకరీ ఫుడ్స్ ని ,జంక్ ఫుడ్స్ ని వాడరాదన్నారు.  శారీరకంగా వ్యాయామం, నడక ,యోగ, ప్రాణయామం లాంటివి ప్రతిరోజు కనీసం 30 నిమిషాల నుండి ఒక గంట వరకు చేయాలన్నారు.  మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని అందుకని ఆటలు ,పాటలు వినడం, సినిమాలు, రీడింగ్ లాంటివి చేయాలని తెలియజేశారు, ఆహార నియమాల్లో మార్పులు చేసుకుంటూ ఉప్పును తగ్గించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డాక్టర్ అంజనా మాట్లాడుతూ జీవనశైలిలో మార్పులు చేసుకున్నట్లయితే తప్పకుండా అధిక రక్తపోటును నియంత్రించవచ్చని అందుకు ప్రతిరోజు శారీరక శ్రమ వ్యాయామం చేయాలన్నారు. పిఓఎన్సిడి డాక్టర్ సామ్రాట్ యాదవ్ మాట్లాడుతూ రక్తపోటు వల్ల మెదడులో రక్తస్రావం , గుండెపోటు, పక్షవాతం, దీర్ఘకాలిక కిడ్నీ సంబంధ వ్యాధులు, కంటిచూపు మందగించడం ,చిన్నచిన్న రక్తనాళాలు దెబ్బ తినడం లాంటి సమస్యలు వస్తాయని, రక్తపోటుకు కారణాలు   ధూమపానం, మద్యపానం, ఊబకాయం శారీరక శ్రమ లేకపోవడం, ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం, ప్రధాన కారణాలని అన్నారు. ధూమపానం, మద్యపానం మానేయడం, ఉప్పు తగ్గించుకోవడం ప్రతిరోజు సుమారు అరగంట శారీరక వ్యాయామం చేయడం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం లాంటివి నిత్యం క్రమo తప్పకుండ పాటించినట్లయితే అధిక రక్తపోటును అధిగమించవచ్చని అన్నారు ,ఇంకా ఈ కార్యక్రమంలో మాలపల్లి వైద్యాధికారిని డాక్టర్ అజ్మతున్నేసా బేగం, ఎపిడమాలజీస్ట్ డాక్టర్ వెంకటేష్, ఏవో రాజేశ్వర్, డి హెచ్ ఈ లు ఘన్పూర్ వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ ఎన్సిడి కోఆర్డినేటర్ వెంకటేష్, హెచ్ ఈ ఓ గోవర్ధన్, ఎమ్మెల్ హెచ్ పి లు కార్యాలయ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Controlling high blood pressure with lifestyle changes