Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 6:36 pm Posted by : ramakrishna

గల్ఫ్ లో చిక్కుకున్న వారి సహాయార్థం కంట్రోల్ రూం ఏర్పాటు

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న వారి సహాయార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గల్ఫ్ దేశాలలో ఉద్రిక్త  పరిస్థితుల నేపథ్యంలో నిజామాబాద్ లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, తెలంగాణ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం న్యూఢిల్లీలో ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ వారి తో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, కంట్రోల్ రూమ్ నెంబర్ 8712659700 అని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో నిజామాబాద్ పౌరులు ఉన్న వారి కుటుంబ సభ్యుల సమాచారం కోసం నిజామాబాద్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. వివరాలకై పోలీస్ కంట్రోల్ రూమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ 8712659821 ని సంప్రదించాలని ఆయన తెలిపారు.