ఐడీఓసీ (కలెక్టరేట్)లో కంట్రోల్ రూం ఏర్పాటు
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో ప్రస్తుత వేసవిలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తినా, ధాన్యం అమ్మకాలలో రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు నెలకొని ఉంటే, వారు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 6644 కు ఫోన్ చేసి సమస్యలు తెలుపవచ్చని అన్నారు. కంట్రోల్ రూమ్ కార్యాలయాల పని...