Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 December 2024, 7:32 pm Posted by : ramakrishna

పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించండి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయా కాలుష్య నియంత్రణ వారోత్సవాల ముగింపును పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ అధికారుల చేత పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రాజశ్రీ  మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం ద్వారా అనేక రకాలైనటువంటి శ్వాస కోసం ఊపిరితిత్తుల వ్యాధులే కాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధుల్ని నియంత్రించి స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోవడం ద్వారా ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా మారతారని తెలియజేశారు. అందుకోసం ప్రతి ఒక్కరూ పర్యావరణ కాలుష్య నియంత్రణ చర్యలను చేపట్టిన లో భాగంగా మొక్కల్ని నాటడం, లైట్లు ఆఫ్ చేయడం ద్వారా విద్యుత్ని ఆదా చేయడం, ఆహార పదార్థాల వ్యర్ధాలను నియంత్రించడం, ఎక్కడపడితే అక్కడ చెత్తకుప్పలను కాల్చి వేయడం నీ ఆపేయడం, జీవనశైలిలో మార్పులు తెచ్చుకుంటూ నడకని సైకిల్ ని ఉపయోగిస్తూ కాలుష్య ని కలిగించే వాహనాలని ఉపయోగించడం తగ్గించడం అదేవిధంగా విద్యుత్ వాహనాలను అందరూ ఉపయోగించేలా ప్రోత్సహించడం , నీటి వృధాను అరికట్టడం,లాంటి చర్యల వల్ల వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించి ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కీటక జనత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డా. వినీత్ రెడ్డి, జిల్లా ఆరోగ్య విద్య బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు, ఎన్సిడి కోఆర్డినేటర్ వెంకటేశం, ఏ ఎం ఓ సలీం , డిపిహెచ్ఎన్ఓ స్వామి సులోచన వివిధ పి హెచ్ సిల నుండి విచ్చేసిన పర్యవేక్షణ అధికారులు పాల్గొన్నారు.