Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 December 2024, 5:36 pm Posted by : ramakrishna

గాలి కాలుష్యాన్ని నియంత్రించండి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గాలి కాలుష్యాన్ని నియంత్రించాలని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ డిస్టిక్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వినీత్ రెడ్డి అన్నారు. జాతీయ గాలి కాలుష్య నియంత్రణ దినం సందర్భంగా సోమవారం స్థానిక దుబ్బ జిల్లా పరిషత్ పాఠశాలలో అవగాహన, విద్యార్థులచే ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ డిస్టిక్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వినీత్ రెడ్డి  మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మొక్కల్ని చెట్లను విరివిగా పెంచుతూ గాలి కాలుష్యాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. అదేవిధంగా కమ్యూనిటీలో పాఠశాలల్లో కళాశాలలో విరివిగా గాలి కాలుష్య నియంత్రణపై చైతన్యం కలిగించే సదస్సులు నిర్వహించడం, ప్రజల్లో వంట చెరుకు ద్వారా వంట చేసే విధానానికి స్వస్తి చెప్పే విధంగా చైతన్యం కలిగిస్తూ ఎల్పిజి గ్యాస్ ని వంట కోసం వాడేలా చూడాలని అన్నారు. అదేవిధంగా వాహనాల కాలుష్యాన్ని, పొగ త్రాగడం ద్వారా కలిగే కాలుష్యాన్ని, పరిశ్రమల ద్వారా విలువడే కాలుష్యాన్ని నియంత్రించడం ద్వారా గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు.

Control air pollution

పంట వ్యర్ధాలను దహనం చేయడం ఇలాంటివి డంపింగ్ యార్డుల్లో,  ఎక్కడబడితే అక్కడ చెత్తకుప్పలను కాల్చి వేయడం లాంటివి చేయకూడదని కోరారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కొరకు ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ ని ఆఫ్ చేసి ఉంచడం విద్యుత్ దీపాలను అవసరం లేని వద్దా ఆఫ్ చేయడం, ప్లాస్టిక్ చారి బ్యాగులర్ నిషేధించడం వస్త్రములతో చేయబడిన క్లాత్ బ్యాగులను వాడడం ప్యాకేజీలు పడును నియంత్రించడం ఎలక్ట్రానిక్ వాహనాలను ఉపయోగించడం ఆహార పదార్థాల వేదాలను నిషేధించడం విరివిగా చెట్లను నాటించడం ద్వారా కాని కాలుష్యాన్ని తగ్గిస్తూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని సందర్భంగా తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఎన్ పీసీసి హెచ్ హెచ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఘనపూర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ  గాలి కాలుష్యం వల్ల కలిగే అనర్ధాలపై తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థుల చేత పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలోఎన్సిడి కోఆర్డినేటర్ వెంకటేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, బాలరాజు ,సుధం, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Control air pollution