ఘనంగా దత్త జయంతి వేడుకలు

రుద్రూర్, బతుకమ్మ  : దత్త పౌర్ణమి పురస్కరించుకొని రుద్రూర్ మండలంలోని సులేమన్ నగర్ గ్రామంలో గల గైనిగుట్ట శ్రీ స్వయంభు బసవేశ్వర ఆలయం వద్ద గల దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఆదివారం శ్రీ దత్త జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి పరమేష్ మహారాజ్, ఆలయ కమిటీ నిర్వాహకులు, మహిళలు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.