మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించండి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బతుకమ్మ ,కామారెడ్డి : మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ప్రజలకు సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి పర్యావరణహితమైన మట్టి గణపతులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రులలో వినాయకుని ప్రతిమలను పూజించడం, అనంతరం నీటి వనరులలో నిమజ్జనం చేయడం మన సాంస్కృతిలో భాగమని అన్నారు....