ఇష్టారాజ్యంగా కాంట్రాక్టులు 

బాన్సువాడ నియోజకవర్గంలో వర్గపోరు ఎంపీడీవోలదే రాజ్యం ఎలాంటి తీర్మానాలు చేయకుండానే పనులు అప్పగింత   బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ నియోజకవర్గంలో అధికారులు ఇష్టారాజ్యంగా తమకు నచ్చిన వాళ్లకే కాంట్రాక్ట్​ లు కేటాయిస్తున్నారని ఓ వర్గం కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. శుక్రవారం నిజామాబాద్​ కలెక్టరేట్ కు ఓ వర్గం కాంగ్రెస్​ కార్యకర్తలు తరలివచ్చారు. కలెక్టరేట్​లో కలెక్టర్​ అందుబాటులో లేకపోవడంతో అదనపు కలెక్టర్​ కిరణ్​కుమార్​కు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎంపీడీవోలదే రాజ్యం.. బాన్సువాడ నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల్లో ఇటీవల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఆయా...