Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 7:53 pm Posted by : ramakrishna

న్యాయవాదుల సంక్షేమమానికి నిరంతర కృషి

…. రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ చలకాని వెంకట్ యాదవ్

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

న్యాయవాదుల సంక్షేమ సాధనే తన ప్రథమ కర్తవ్యమని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ చలకాని వెంకట్ యాదవ్ అన్నారు.గురువారం నిజామాబాద్ జిల్లాకోర్టు సముదాయంలోని సమావేశపు హల్ లో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నీలకంఠ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు.న్యాయవాదుల సంక్షేమ నిధికి, హెల్త్ కార్డులకు సరిపోయినన్ని ఆర్థిక వనరులు లేవని దానికి తోడు అడ్వకేట్స్ ఫీ రూల్స్ లో కొన్ని సవరణలు అవసరమని బార్ అధ్యక్షులు నీలకంఠ రావు, ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి తెలిపిన నేపథ్యంలో ఆయన పై విదంగా స్పందించారు. పెరిగిన ధరల సూచికి అనుగుణంగా న్యాయవాదుల సంక్షేమ నిధికి ఆర్థిక తోడ్పాటు అవసరమేనని యాదవ్ అన్నారు. హెల్త్ కార్డులకు ప్రస్తుతం అందజేస్తున్న రెండు లక్షలను ఐదు లక్షలకు పెంచే విదంగా గట్టి ప్రయత్నాలు చేస్తానని తెలిపారు. అడ్వకేట్స్ రూల్స్ లో పీజుల పెంపులో సవరణలు చాలా అవసరని అందుకు బార్ కౌన్సిల్ తీవ్రంగా శ్రమిస్తుందని పేర్కొన్నారు. న్యాయవాదిగా న్యాయవాదులతో కలిసి నడుస్తానని ఉమ్మడి ఉండి అందరి ప్రయోజనాలు కాపాడుతానని ఆయన తెలిపారు. న్యాయవాదుల స్వరం బార్ కౌన్సిల్ అని అందులో న్యాయవాదుల గొంతుకగా పని చేస్తానని వెంకట్ యాదవ్ అన్నారు. సమావేశానంతరం వెంకట్ యాదవ్ ను అధ్యక్షులు నీలకంఠ రావు, సుభాష్ రెడ్డి శాలువాతో సన్మానించారు. సమావేశంలో బార్ ఉపాధ్యక్షుడు ఆవుల నారాయణ రావు,సీనియర్ న్యాయవాదులు మంతెన రాజేందర్ రెడ్డి, మాధాస్తు రాజారెడ్డి, ఎర్రం గణపతి, శ్రీహరి ఆచార్య, జే. వెంకటేశ్వర్, వి. భాస్కర్, ఆల్గొట్ రవీందర్,మాణిక్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Continuous efforts for the welfare of advocates