ఆర్ధిక ఇబ్బందులను అధిగమిస్తూ నిరంతర అభివృద్ధి
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ నగరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిజామాబాద్, బతుకమ్మ : ఆర్ధిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం వాటిని అధిగమిస్తూ ప్రజల సౌకర్యార్ధం అభివృద్ధి పనులను నిరంతర ప్రక్రియగా చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని వివిధ డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తదితరులతో కలిసి...