Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 5:02 pm Posted by : ramakrishna

బాబ్లీ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

మెండోరా, బతుకమ్మ: బాబ్లి ప్రాజెక్టులోకి పై నుండి కొనసాగుతున్న వరద నీరు వలన పాక్షికంగా కొన్ని గేట్లు వరద ప్రవాహం ఉన్నంతవరకు తెరచి ఉంచబడతాయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎస్.ఈ జగదీష్ తెలిపారు. ఎగువ బాగాన మహా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బుధవారం త్రీ సభ్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో మూసివేశారు. కానీ ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి 59,654 క్యూసెక్కుల వరదనీరు వస్తూ ఉన్నందున బాబ్లీ ప్రాజెక్టు కు మొత్తం 14 గేట్లు ఉంటే ఇందులో 10 గేట్లను మూసివేసి, వస్తున్న వరద ను దృష్టిలో ఉంచుకొని నాలుగు గేట్లను తెరిచి ఉంచినట్లు  ఆయన పేర్కొన్నారు. వస్తున్న  వరద తగ్గిన వెంటనే బాబ్లిగేట్లను మూసి వేసుకొని అవకాశం నాందేడ్ ఇరిగేషన్ అధికారులకు ఉంటుందని ఆయన తెలియజేశారు. మహారాష్ట్ర పరిసర ప్రాంతంలో నిలిచిన నీటికి బదులుగా మళ్లీ   మార్చి 1వ తేదీన బాబ్లీ గేట్లను ఎత్తి 0.6 టిఎంసి నీటిని ఎస్సారెస్పీకి వదులుతారని తెలియజేశారు. కార్యక్రమంలో సి డబ్ల్యూ సి ఈ ఫ్రాంక్లిన్, నాందేడ్ ఈ ఈ బన్సాద్, ఎస్సారెస్పీ ఏ ఈ ఈ కొత్త రవి, ఎస్ డి ఈ సి డబ్ల్యూ సి సతీష్ తదితరులు పాల్గొన్నారు.