Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 5:22 pm Posted by : ramakrishna

కౌలాస్ నాలా ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద నీటి ప్రవాహం

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ మండలంలోని సావర్‌గాం గ్రామంలో ఉన్న కౌలాస్ నాలా ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 458.00 మీటర్లు కాగా, ప్రస్తుతం 457.35 మీటర్ల నీటిమట్టం ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 265 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు ఏఈ రవిశంకర్ పేర్కొన్నారు. ప్రాజెక్టు నీటిమట్టం, ఇన్‌ఫ్లో పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

 

Continued inflow of floodwater into the Kaulas Nala Project.