ఎల్‌ నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలి

  . . . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎల్‌ నినో కారణంగా రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికల రూపకల్పనకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల స్పెషల్ ఆఫీసర్లు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో తీసుకోవలసిన చర్యలపై...