Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 8:57 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబాల పరామర్శ

కమ్మర్ పల్లి, బతుకమ్మ : మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు ఆత్మీయ భాదిత కుటుంబాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో నివాసం ఉంటున్న నాగపూర్ మాజీ సర్పంచ్ పాలెపు సాయమ్మ  కుమారుడు, బీయర్ ఎస్ నాయకులు కిరణ్ ఆరోగ్యం బాగాలేనందున ఆయన్ని పరామర్శించారు.మండలం లోని హాసకోత్తుర్ గ్రామానికి చెందిన మెట్టుపల్లి రాజన్న హార్ట్ఏటాక్ తో కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.10000 ఆర్థిక సహాయం అందజేశారు. అదే గ్రామానికి చెందిన మంగలి శంకర్ భార్య కాలం చేయడంతో వారిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంగలి నర్సయ్య కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బషీరాబాద్ గ్రామంలో గ్రామ ఎంపిటిసి మామ, బీయర్ ఎస్ నాయకులు అప్పయ్య కాలు ఇన్ఫెక్షన్ తో బాధ పడుతుండటంతో వారిని పరామర్శించారు. భోజపల్లి దేవిదాస్ వాళ్ళ నాన్న కాలం చేయడంతో వారిని కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Consultation with the families of the victims