Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 6:36 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబాలను పరామర్శ

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మండలంలోని పలువురు ఆత్మీయ బాధిత కుటుంబాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరామర్శించారు. ఇందులో భాగంగా మండలంలోని సికింద్రాపూర్ తండా కు చెందిన పూజారి, తండ పెద్దమనిషి చినియా నాయక్ కాలం చేయగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భీమ్ గల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ భగత్  తాతయ్య  కాలం చేయడంతో వారికుటుంబ సభ్యులను పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బోయిగల్లి అశోక్ ఇటీవల కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం పట్టణ కేంద్రానికి చెందిన పార్టీ నాయకులు నవీన్ తాతయ్య కాలం చేయడంతో వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Consultation with the families of the victims