ఆర్మూర్, బతుకమ్మ : మండలంలోని ఫతేపూర్, మంథని గ్రామాల్లోకి పలువురు ఆత్మీయ భాదిత కుటుంబాలను ఆర్మూర్ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఇందులో భాగంగా మండలంలోని ఫతేపూర్ గ్రామ మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్దం వెంకట్ రాజు అనారోగ్యానికి గురికాగా ఆయన్ని పరామర్శించి, ఆయన ఆరోగ్య స్థితిగతులను అడిగి తెల్సుకొన్నారు. మండలంలోని మంథని గ్రామానికి చెందిన ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బూస మల్లన్న తండ్రి ఇటీవలే మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట ఆర్మూర్ మండల పార్టీ ప్రెసిడెంట్ చిన్నారెడ్డి, ఆర్మూర్ పట్టణ పార్టీ ప్రెసిడెంట్, ఏ ఏం సీ చైర్మన్ సాయిబాబా గౌడ్, పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్లు అయ్యప్ప శ్రీను, పవన్ పండిత్, తలారి పోచన్న, ఆర్మూర్ మండల పార్టీ జనరల్ సెక్రటరీ బత్తుల ప్రవీణ్ కుమార్, సునీల్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, మట్ట సంజీవ్, పొక్కుల లింబాద్రి, మట్ట సాయరెడ్డి, రంగారెడ్డి, లింగారెడ్డి, కిరణ్, విశ్వంత్, దేవేందర్ రెడ్డి, విజయ్ అగర్వాల్, చిట్టిరెడ్డి, మొసీన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.