Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 September 2025, 5:57 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబాలను పరామర్శ

కమ్మర్ పల్లి, బతుకమ్మ : మండలంలోని కోనాసముందర్, కొనాపూర్ లకు చెందిన పలువురు భాదిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ కానిస్టెన్సీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. ఇందులో భాగంగా ఆదివారం మండలంలోని కోనాపూర్  గ్రామానికి చెందిన బడాల లింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. అదే గ్రామానికి చెందిన తెడ్డు గంగారం ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మండలంలోని కోనసముందర్ గ్రామానికి చెందిన భిక్షపతి ఇటీవల గుండె పోటుతో మరణించగా  వారి కుటుంబ సభ్యులను, అదే గ్రామానికి చెందిన బద్దం కిషన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Consultation with the families of the victims