భీంగల్, బతుకమ్మ : భీమ్ గల్, కమ్మర్ పల్లి మండలాలకు చెందిన పలువురు ఆత్మీయ బాధిత కుటుంబాలను గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఇందులో భాగంగా భీమ్ గల్ మండలంలోని బడా భీమ్ గల్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త బక్కన్నోళ్ల సతీష్ వాళ్ళ నానమ్మ ఇటీవల కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు మండ్ర సుమన్ తల్లి కాలం చేయడంతో వారిని పరామర్శించారు. శాంకురి మహేందర్ ,దేవేందర్ వల్ల తండ్రి కాలం చేయడంతో వారిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రేమ్ చంద్ వాళ్ళ తండ్రి కాలం చేయడంతో వారిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ యువ నాయకులు మల్లెల శ్రీకాంత్ తండ్రికి ఇటీవల కాలికి ఫ్యాక్చర్ కావడంతో వారిని పరామర్శించారు. కమ్మర్ పల్లి మండలంలోని ఇనాయత్ నగర్ గ్రామానికి చెందిన బీయర్ యస్ కార్యకర్త, అభిమాని మెట్టు సాయన్న ఈ మధ్య కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.ఎమ్మెల్యే వెంట స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు.
