Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2024, 6:42 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబాల పరామర్శ 

మెండోరా, బతుకమ్మ : బాల్కొండ కానిస్టెన్సీ లోని మెండోరా, ముప్కాల్ మండలాలలోని పలు భాధిత కుటుంబాలను సోమవారం కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరమార్శించారు. ఇందులో భాగంగా మెండోరా మండలంలోని చాకిర్యాల్ గ్రామానికి చెందిన ఆరెపల్లి బుచ్చన్న కుమారుడు ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరమార్శించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముప్కాల్ మండలంలోని నల్లూరు గ్రామానికి చెందిన జోగు లింబన్న ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని, అదే గ్రామానికి చెందిన గాజుల సుశీల మరణించగా వారి కుటుంబాన్ని ఆయన పరమార్శించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట మురళి, మధు, రాము, రంజిత్, దేవేందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.